యంగ్ హీరో రామ్ ఎనర్జీ లెవల్స్ గురించి చెప్పుకోవడానికేముంది. ఎనర్జీతో పాటు మాంచి సక్సెస్ కూడా అందుకున్నాడు 'నేను శైలజ..' సినిమాతో రామ్. ఆ సక్సెస్‌ని 'హైపర్' సినిమాతో కొనసాగించలేకపోయినా, ఈ సారి మాత్రం పక్కా ప్లానింగ్‌తో వస్తున్నాడు రామ్. హిట్ పక్కా అంటున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్‌లోనే రామ్ తాజా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ మొత్తం మార్చేశాడు. చాక్లెట్ బోయ్‌లా నీట్ షేవ్‌లో కనిపించే రామ్ ఇప్పుడు గుబురు గెడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. తన తాజా చిత్రం కోసం రామ్ మేకోవర్ ఇది. గత కొంత కాలంగా తన న్యూ లుక్‌ని జనానికి పరిచయం చేస్తూ వచ్చాడు రామ్. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ మీదికెళ్లింది. స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ ఈ సినిమాలో రామ్‌కి జంటగా నటిస్తున్నారు. 'నేను శైలజ..' సినిమాతో కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ డిఫరెంట్ మార్క్‌ని అందించాడు. చాలా సింపుల్‌గా క్యాచీగా తాను అనుకున్నది తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకుని మనసు దోచాడు. అలాగే ఈ సినిమా స్టోరీని కూడా చాలా క్యాచీగా ప్రిపేర్ చేశాడంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల నుండి అందిన సమాచారమ్. యంగ్ హీరో శ్రీ విష్ణు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకిఅదనపు ఆకర్షణ కానుంది.