యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో సంచలన పోస్టింగ్ పెట్టాడు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్న నేపథ్యంలో రామ్ పోతినేని టీట్ చాలామందికి పెద్ద షాకే ఇచ్చింది.
''ఇంటర్ రిజల్స్‌నే జీవితం అనుకునే నా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి.. మీరు జీవితంలో అవ్వబోయేదానికి, చెయ్యబోయేదానికి ఇది ఒక 'ఆ..'తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి'' అని పేర్కొంటూ 'ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ.. రామ్ పోతినేని..' అంటూ చివర్లో ముగించాడు. 'ఇంటర్ బోర్డ్ మర్డర్స్' హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. రామ్ ట్వీట్‌పై స్పందిస్తూ హీరోయిన్ నిధి అగర్వాల్ 'మాస్..' అని రిప్లయ్ ఇచ్చింది. నిధి అగర్వాల్ తెలుగు నేర్చుకుందా? తెలుగు నేర్చుకుంటే, రామ్ చెప్పిన దాంట్లో 'ఆ..' అనే పదానికి అర్థం తెలుసుకుందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రామ్ ఇంటర్మీడియట్ పూర్తి చేయకపోవడమేంటని ఇంకొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు రామ్ పోతినేని చేసిన ట్వీట్‌ని అభినందించాల్సిందే. కానీ, 'ఆ..' అని వాడటం కొంత అభ్యంతరకరం.
దాన్ని 'మాస్' అని నిధి అగర్వాల్ చెప్పడం ఇంకా బాధాకరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు ఇంటర్ రిజల్ట్స్ విషయమై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో తమదైన స్టయిల్లో స్పందిస్తోన్న సంగతి తెల్సిందే.