స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన ఇమేజ్‌కి భిన్నంగా ఓ సాధారణ పల్లెటూరి యువకుడి పాత్రని ఎంచుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 'రంగస్థలం' సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ చాలావరకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ చాలావరకు లుంగీలోనే కనిపించనున్న సంగతి తెలిసినదే కదా. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌లో లుంగీ కాలంనాటి సినిమా చెల్లుతుందా? అన్న సందేహాలున్నాయి. కానీ అక్కడున్నది దర్శకుడు సుకుమార్. ట్రెండీ సినిమాలు తీయడంలోనే కాదు, భావోద్వేగాలు పండించడంలో కూడా సుకుమార్ దిట్ట. 'రంగస్థలం' సినిమా టైటిల్ పెట్టడంలోనే కాదు, రామ్‌చరణ్‌ని లుంగీలో చూపించడం వెనుక కూడా పెద్ద కథే ఉందట. అదేంటో తెరపైనే చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. తెలుగు తెరపై ఈ సినిమా సరికొత్త సంచలనం సృష్టించనుందని చిత్ర యూనిట్ సభ్యులంటున్నారు. ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరి అందాలను ఈ సినిమాలో హైలైట్ చేసి చూపించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత అందమైన ఆ లొకేషన్స్‌ని తెరపై చూసే ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఫీల్ అవుతారనీ అంటున్నారు. ఏదేమైనా పాతకాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో సెన్సేషన్‌కి రెడీ అవుతున్న చరణ్, ఈ క్రమంలో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలిక.