మెగా కోడలు, మెగా పవర్ స్టార్ చరణ్ సతీమణి ఉపాసనకు జంతువులంటే ప్రాణం. ఇప్పటికే పలు రకాల జంతువులను తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది ఉపాసన. ఈ పెట్ ఏనిమల్స్లోకి మరో కొత్త చుట్టం వచ్చి చేరింది. అదే ఓ కోడిపుంజు. ప్రస్తుతం చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోనమసీమ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ షూటింగ్లో చరణ్‌తో పాటు ఉపాసన కూడా పాల్గొంటోంది. అక్కడి పల్లెటూరి వాతావరణం, గోదావరి సొగసులను ఉపాసన ఆస్వాదిస్తోంది. ఆ స్వీట్ మెమరీస్‌ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా కోనసీమలో మెగా ఫ్యాన్స్‌లోని ఒకరు చరణ్‌కి ఓ కోడిపుంజును గిఫ్ట్‌గా ఇచ్చారట. ఆ కోడిపుంజుతో చరణ్ దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఉదయాన్నే కోడిపుంజు కూతతోనే తాము నిద్ర లేస్తున్నామనీ చెబుతోంది ఉపాసన. పర్సనల్ అనుభవాలతో పాటు, చరణ్ సినిమా విషయాలను కూడా ఉపాసన అభిమానులతో పంచుకుంటోంది. తమ అభిమాన హీరో అనుభవాలను అభిమానులకు తెలియపరుస్తూంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది ఫ్యాన్స్‌కి. ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోన్న ఈ తాజా చిత్రానికి 'రేపల్లె' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌తో ముద్దుగుమ్మ సమంత తొలిసారిగా జత కడుతోంది.