ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నా - చరణ్‌

By iQlikMovies - December 07, 2018 - 19:38 PM IST

మరిన్ని వార్తలు

పోలింగ్‌ డే కావడంతో ఈ రోజు పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుని, అందర్నీ ఓటు వేయాలని కోరారు. అయితే మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా.. అందరూ దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి అని చరణ్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. తనకు ఆ అవకాశం రాలేనందుకు బాధపడుతున్నాను.

కానీ అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్న కారణంగానే చరణ్‌ ఈ సారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారనీ సమాచారమ్‌. మెగాస్టార్‌ చిరంజీవి సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మెగాఫ్యామిలీ నుండి అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకుని సోషల్‌ మీడియా ద్వారా అందర్నీ ఓటు హక్కును వినియోగించుకోమని కోరారు.

అలాగే మహేష్‌బాబుతో సహా సూపర్‌స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా ఓటు వేశారు. ఎన్టీఆర్‌ క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకొనగా, నాగార్జున, శ్రీకాంత్‌, నితిన్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యం పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS