ఒకప్పుడు అగ్ర హీరోలతో ఆడిపాడిన తార రమ్యకృష్ణ. కమర్షియల్ సినిమాలకు తాను కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది. తనవన్నీ దాదాపుగా గ్లామర్ పాత్రలే. చిరంజీవితో అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల తరవాత... చిరుతో కలసి మరో సినిమా చేయబోతోంది. అదే... గాడ్ ఫాదర్. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం లూసీఫర్. తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ అవుతోంది. చిరంజీవి కథానాయకుడు.
ఈ చిత్రంలో చిరు చెల్లాయిగా రమ్యకృష్ణ కనిపించనుంది. మోహన్ రాజా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చిరు సరసన నయతార కథానాయికగా నటిస్తోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించబోతున్నాడు. ఓపాట కోసం వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తారని సమాచారం. చిరుచెల్లాయి పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లు పరిశీలించారు.
ఒకప్పుడు చిరుతో కలిసి జోడీ కట్టిన సుహాసిని పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి రమ్యకృష్ణని ఖాయం చేశారు. అప్పట్లో చిరు తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన రమ్య.. ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ ధారబోస్తే.. తెరపై చూడ్డానికి ఎలా ఉంటుందో?