సాయిధరమ్ తేజ్ - దేవాకట్టా కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నివేదా పేతురాజ్ కథానాయిక. ఇదో పొలిటికల్ డ్రామా. `రిపబ్లిక్` అనే పేరు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఇందులో విలన్ ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. అయితే.. ఈ సినిమాలో లేడీ విలన్ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ ని ఎంచుకున్నట్టు టాక్. బాహుబలిలో `శివగామి` పాత్ర తరవాత.. రమ్యకృష్ణ రేంజ్ పెరిగింది.
అయితే ఆ తరవాత ఆమె చేసినవన్నీ పాజిటీవ్ పాత్రలే. తనని నెగిటీవ్ పాత్రలో చూపిస్తే ఎలా ఉంటుందన్నది దేవా కట్టా ఆలోచన. పైగా `నరసింహ`లో నీలాంబరి పాత్ర రమ్యకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నీలాంబరి తరహాలో పవర్‌ఫుల్ గా సాగే పాత్ర ఇదని సమాచారం. సాయిధరమ్ - రమ్యల పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్టు సాగుతాయని తెలుస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. `భద్రమ్ బీకేర్ ఫుల్ బ్రదరూ` తరవాత... విడుదలయ్యే తేజూ సినిమా ఇదే.