ఘాజీ చిత్రం ద్వారా డైరెక్టర్ సంకల్ప్, హీరో రానా, అలాగే ప్రొడ్యూసర్స్ పీవిపీ-నిరంజన్ రెడ్డిలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచగలిగారు అనే చెప్పాలి.
ఇక కల్లెక్షన్స్ పరంగా చూస్తే, తెలుగు-హిందీ-తమిళ భాషల్లో విడుదలైన నాల్గవ రోజుకి రూ 19.50 కోట్లు ఆర్జించింది. ఇందులో సుమారుగా రూ 8కోట్లు హిందీ వెర్షన్ కి కావడం విశేషం. అయితే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ వల్లనే సోమవారం కూడా కల్లెక్షన్స్ స్టడీగా వస్తున్నాయి.
మొత్తానికి ఈ చిత్రంపై కురుస్తున్న అభినందనల జల్లు చూస్తుంటే ఘాజీ టీం ప్రయత్నమైతే సఫలీకృతమైతే అయిందని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఇది ఎంతవరకు పోగు చేస్తుందో చూడాలి.