తెలుగు సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల కాకుండానే తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. త్వరలో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోంది ఈ సినిమా. తమిళ ట్రైలర్‌ని లేటెస్ట్‌గా విడుదల చేశారు. '100 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో కూర్చోబెడితే నేనే సీఎం' అని రానా చెప్పిన డైలాగ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. శశికళ 100 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో దాచి, ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్నే ట్రైలర్‌లో హైలైట్ చేసి, రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమయ్యింది. అయితే తెలుగులో ఏ రాజకీయ పార్టీనీ ఉద్దేశించి రాసిన డైలాగ్ కాదిది. కానీ అనుకోకుండా తమిళ రాజకీయాలకు మాత్రం సూట్ అయిపోయింది. రానాకి తమిళనాడులో కూడా గుర్తింపు ఉంది నటుడిగా. కాజల్ ఎన్నో తమిళ సినిమాల్లో నటించింది. దాంతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని 'నాన్ అనైయిట్టాల్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు తమిళంలో. ఈ టైటిల్ కూడా పొలిటికల్ టచ్ ఉంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజెఆర్ నోట ఈ మాట ఎక్కువగా వచ్చేదట. ఇలా ఈ రానా సినిమా తమిళనాడు రాజకీయాలను విడుదలకు ముందే ప్రభావితం చేసేస్తోంది. ఇక సినిమా విడుదలయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి. తెలుగులో మాత్రం ఈ సినిమా ట్రైలర్‌కి వస్తోన్న రెస్పాన్స్ అదరిపోతోంది.