డైరెక్టర్ తేజ అంటే అప్పట్లో సంచలనం. 'చిత్రం' సినిమాతో కొత్త నటీ నటులకు ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ కొట్టాడు తేజ. తేజ సినిమాలకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఈ మధ్య తేజ సినిమాలకు ఆదరణ తగ్గింది. దాంతో తేజ సినిమాలు చేయడం తగ్గించేశాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత తేజ డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి. రానా కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ నెంబర్ వన్ హీరోయిన్స్‌లో ఒకరు. అలాంటిది చిన్న డైరెక్టర్ తేజతో సినిమా చేస్తోందేంటనుకున్నారంతా. కానీ కాజల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తేజ సినిమాతోనే. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తన తొలి సినిమా డైరెక్టర్‌తో కాజల్ నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే, 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ టైటిల్‌తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. రానాని సరికొత్త యాంగిల్‌లో చూపించబోతున్నాడట. ఇదో పొలిటికల్ డ్రామా. రానా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతోందట. ఇప్పటికే రానా 'లీడర్' సినిమాతో పొలిటికల్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో నటించాడు. తొలి సినిమాకే 'లీడర్'తో పొలిటికల్ కాన్సెప్ట్‌ని టచ్ చేశాడు రానా. అయితే ఈ సినిమాకి రానాలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఈ సినిమా కథా, కథనాలు 'నిజం', 'లీడర్ 'సినిమాలను పోలి ఉంటాయనీ, సినిమా కాన్సెప్ట్ చాలా బలమైందనీ ప్రచారం జరుగుతోంది.