రానాని ఓ లవర్ బోయ్‌గా చూస్తుంటుంది మీడియా. ఎందుకంటే చేసిన సినిమాల కంటే, హీరోయిన్లతో లింకులు పెడుతూ వచ్చిన గాసిప్పులే.. మనోడ్ని స్టార్‌ని చేసేశాయి. బిపాసాబసుతో లవ్ మేటర్ నడిపినట్టు అప్పట్లో హాట్ హాట్ వార్తలు బయటకు వచ్చాయి. మధ్యలో కొంతకాలం శ్రియ పేరూ వినిపించింది. త్రిష - రానాలకు లింకులు పెడుతూ మాట్లాడుకొన్నారు. అయితే... ఆ తరవాత ఆ వార్తలన్నీ సద్దుమణిగాయి. ఇప్పుడో ఫొటో బయటకు వచ్చి, రానా పాత ప్రేమ ప్రేమకథల తుట్టె కదిపింది. త్రిషకు రానా ఓ ఘాటు ముద్దు ఇస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. ఇదేం కొత్త ఫొటో కాదు.. బహు పాతది. సుచిత్ర అనే ఆర్జే.. ఈ ఫొటోని బయట పెట్టింది. అప్పట్లో రానా, త్రిషల మధ్య ఎఫైర్ ఎంత ఘాటుగా నడిచిందో చెప్పడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఇదోదో ఫ్రెండ్లీగా ఇస్తున్న ముద్దులా లేదు. ఇద్దరి మధ్యా.. `లవ్` మేటర్ లేకపోతే... ఈ స్థాయిలో ముద్దు లిచ్చుకొంటారా? మరి ఈ ఫొటో చూసి ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.