'రంగ‌మార్తండ' క‌మ‌ర్షియ‌ల్ గా ఓకేనా?

మరిన్ని వార్తలు

ఓ సినిమాకి 'మంచి' సినిమా అని ముద్ర ప‌డితే స‌రిపోదు. దానికి డ‌బ్బులూ రావాలి. టాప్ రేటింగుల్లో రివ్యూలొచ్చి, బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా ప‌డితే లాభం లేదు. ప్ర‌శంస‌లు, అవార్డులూ నిర్మాత క‌డుపు నింప‌వు. ఓ సినిమా వ‌ల్ల న‌ష్ట‌పోతే, ఎన్ని అవార్డులు వ‌చ్చినా లాభం ఏమిటి? అందుకే నిర్మాత సేఫ్ అయిపోవ‌డం చాలా ముఖ్యం. ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాల్లో 'బ‌ల‌గం'కి మంచి టాక్ వ‌చ్చింది. దానికి త‌గ్గ‌ట్టుగానే వ‌సూళ్లూ బాగున్నాయి. ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ. మంచి సినిమా తీశార‌న్న పేరుతో పాటు, లాభాలూ చూశారు.

 

ఇప్పుడు 'రంగ‌మార్తాండ' విష‌యానికి వ‌ద్దాం. కృష్ణ‌వంశీ చాలా ప్రేమ‌తో తీసిన సినిమా ఇది. విడుద‌ల‌కు ముందే ప్రివ్యూలు వేయ‌డం వ‌ల్ల‌... చూసిన‌వాళ్లంద‌రికీ ఈ సినిమా న‌చ్చ‌డం వ‌ల్ల‌.. మంచి టాక్ అయితే వ‌చ్చింది. మ‌రి... టాకుల‌తో సినిమా హాళ్లు నిండుతాయా? మంచి సినిమాకి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ద‌క్కుతుందా? వాళ్లు వ‌చ్చి ఈ సినిమా చూస్తారా? అనే సందేహం వ్య‌క్త‌మైంది. ఆనంద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే...రంగ‌మార్తాండ‌కి ఉగాది రోజున ఆశించిన స్థాయిలో వసూళ్లు అందాయి. త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసినా... అవ‌న్నీ దాదాపు 70 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ సాధించాయి. చిన్న సినిమాకి.. ఈ మాత్రం వ‌సూళ్లు రావ‌డం, అది కూడా మాస్ సినిమా దాస్ కా ధ‌మ్కీతో పోటీగా వ‌చ్చిన సినిమా కావ‌డంతో.. రంగ‌మార్తండ నిర్మాత ఊపిరి పీల్చుకొన్నాడు. దాస్ కా ద‌మ్కీ లో ఫ్యామిలీతో చూసే ఎలిమెంట్స్ లేవు. కాబ‌ట్టి కుటుంబ ప్రేక్ష‌కుల మొద‌టి ఛాయిస్‌.. రంగ‌మార్తాండ‌నే. ఈవారం రంగ‌మార్తండ‌కు ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు క‌నిపించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ఆమేజాన్ ప్రైమ్ ఓటీటీ హ‌క్కుల్ని సొంతం చేసుకొంది. అమేజాన్ డిల్ వ‌ల్ల పెట్టుబ‌డిలో దాదాపుగా స‌గం డ‌బ్బులు వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు టాక్‌. సో... రంగ‌మార్తండ క‌మ‌ర్షియ‌ల్‌గానూ గ‌ట్టెక్కేసిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS