'రంగస్థలం'డే - పోటెత్తుతున్న ట్విట్టర్‌

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగస్థలం' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాత్రి నుండే సోషల్‌ మీడియాలో ట్వీట్స్‌ పోటెత్తాయి. ఒక్క ట్వీట్‌ కూడా నెగిటివ్‌గా రాకపోవడం విశేషం. రామ్‌చరణ్‌ నటన గురించే మాట్లాడుకుంటున్నారంతా. ఈ మధ్య కాలంలో ఇంత పోజిటివ్‌ టాక్‌ ఏ సినిమాకీ వచ్చింది లేదు. 

రామ్‌చరణ్‌ యాక్టింగ్‌కి అంతా ఫిదా అయిపోతున్నారు. అనుకున్న దానికి మించి రామ్‌చరణ్‌ పర్‌ఫామెన్స్‌ ఉందంటున్నారు. మరో పక్క సినిమా ప్రీమియమ్‌ వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్స్‌లో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. అభిమానులు వాటిని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేస్తున్నారు. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో 'రంగస్థలం' విడుదలవుతున్న ధియేటర్స్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ హంగామా, సోషల్‌ మీడియా రెస్పాన్స్‌ చూస్తుంటే, చిట్టిబాబు బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే అనిపిస్తోంది. 

సుకుమార్‌ టేకింగ్‌కీ, చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ నటనకీ మాటల్లేవ్‌ మాట్లాడుకోవడాల్లేవ్‌ అన్న రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తోంది. ఇక రామలక్ష్మిగా సమంత పాత్ర కూడా యాక్టింగ్‌ స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ అనీ, సమంత పర్‌ఫామెన్స్‌ అదరగొట్టేసిందనీ అంటున్నారు. అలాగే అనసూయ, ఆది పినిశెట్టి పాత్రలకు కూడా రెస్పాన్స్‌ అలాగే వస్తోంది. చూడాలి మరి. ఫైనల్‌ రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో. 

ఈ రోజు సాయంత్రానికి ఫైనల్‌ రిజల్ట్‌ ఏంటనేది తెలిసిపోనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS