ఈ మధ్య టాలీవుడ్ లో వరుస వివాదాలు చెలరేగుతున్నాయి. ముందు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం మొదలైంది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడని లావణ్య రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసింది. చాలా రోజులు ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తరవాత టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు హల్చల్ చేసింది. జానీ అరెస్ట్, జ్యుడిషియల్ కస్టడీ అంటూ ఇంకా హడావిడి కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఇంకో కేసు బయట పడింది. యూట్యూబర్ హర్ష సాయిపై బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ కేసు పెట్టింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని మిత్రా శర్మ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. లాయర్ తో సహా నార్సింగ్ పోలీసు స్టేషన్ కి రావటం గమనార్హం. కేసు ఫైల్ చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రేమించానని మాయ మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని మోసం చేసినట్లు మిత్రా శర్మ పేర్కొంది. అతడి ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేశారని మిత్రా ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని, తీరా ఇప్పుడు పెళ్లి ఊసు ఎత్తడం లేదని. తనకి ఏ విషయం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని, మిత్ర తెలిపింది. హర్ష సాయితో పాటు అతడి ఫ్యామిలీ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసున్నారు. ఆమె కంప్లైంట్ లో సాయి తనపై అత్యాచారం చేయటమే కాకుండా తన న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసేవాడని, వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా సార్లు లైంగిక దాడి చేశాడని మిత్రా పేర్కొంది.
బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ గా మిత్రా శర్మ పాపులర్ అయ్యింది. మిత్ర నిర్మాతగా హర్షసాయితో 'మెగా' అనే సినిమా నిర్మిస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని మాటివ్వటంతోనే అతని కెరియర్ కోసం తనకోసం దాచుకున్న మొత్తాన్ని హర్ష కోసం ఖర్చు పెట్టి సినిమా నిర్మిస్తున్నట్టు మిత్ర తెలిపింది. కానీ చివరికి హర్ష మోసం చేయటంతో తాను ఇలా బయటికి రావాల్సి వచ్చిందని తెలిపింది. పోలీసులు హర్షసాయిని సంప్రదించటానికి ప్రయత్నం చేసినా అతను అందుబాటులో లేడని సమాచారం, హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.