నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. అయితే.. ఇప్పుడు ఓ వారం రోజులు ఆలస్యంగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్సయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల టైటిల్ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. 'బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య' అంటూ సాగే టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. పాటలన్నీ ఒక్కోటిగా విడుదల చేసి, త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్ గా చేయాలని యూనిట్ భావిస్తోంది.