బుల్లితెర పై యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి రష్మీ. ఈ మధ్య ఆమె నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, రష్మీ కి అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఆది హీరోగా నటిస్తున్న నెక్స్ట్ నువ్వే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఆమె ఫాన్స్ తో పేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమెకి ఫాన్స్ నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. జబర్ధస్త్ కమెడియన్ సుధీర్ తో క్లోజ్ గా ఉండటం గురించి ప్రస్తావిస్తూ.. ఓ అభిమాని మీరు అతన్ని పెళ్ళి చేసుకుంటారా..? అని అడగగా ఆమె సమాధానం ఇచ్చింది. నేను - సుధీర్ కలిసి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో అలాంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చు. చేసే ప్రోగ్రామ్స్ హిట్ కావాలనే ఉద్దేశంతో తనతో కాస్త చనువుగా ఉంటా తప్ప, వేరే ఉద్దేశం ఏమీ లేదని, అది చూసి మీరు తప్పుగా అనుకోవద్దని తేల్చేసింది.
ఇక ఆమె నటిస్తున్న చిత్రాలు వరుసగా ఫ్లాఫ్ అవ్వటం గురించి ఓ అభిమాని ప్రస్తావించాడు. మీరు నటించిన నెక్స్ట్ నువ్వే సినిమా కూడా ఫ్లాఫ్ అవుతుందని ఓ అభిమాని కామెంట్ చేసాడు. దీంతో ఆగ్రహానికి గురైన రష్మీ ఆ అభిమాని పై విరుచుకుపడింది. సక్సెస్ - ఫెయిల్యూర్ అనేది ఒకరిపై ఆధారపడి ఉండదని, ఫస్ట్ నువ్వు నెగిటివ్ గా థింక్ చేయటం మానమంటూ, అతనికి బెస్టాఫ్ లక్ చెప్పింది.