హాట్ హాట్‌గా స్కిన్ షో చేసేసి, తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ పెంచేసుకున్న బుల్లితెర సంచలనం రష్మి గౌతమ్, అంతే వేగంగా తెలుగు తెరపై నుంచి ‘బ్రేక్’ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు రష్మి తలుపు తడుతున్నాయి. తాజాగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాలో రష్మి లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. రష్మి లుక్ ఇలా బయటకు రాగానే, అలా వైరల్ అయిపోయింది. క్యూటెస్ట్ ఎవర్.. అనే స్థాయిలో రష్మి లుక్‌ని తీర్చిదిద్దారు.
రష్మి అంటేనే హాట్ అలర్ట్.. అలాంటిది, క్యూట్‌గా ఆమెను ప్రొజెక్ట్ చేయడమేంటి.? అని కొందరు రష్మి అభిమానులు సోషల్ మీడియాలో అవాక్కవుతున్నారు. అయితే, సినిమాలో కావాల్సినంత హాట్ కంటెంట్ వుంటుందనే వాదనలూ విన్పిస్తున్నాయ్. ఇదిలా వుంటే, రష్మి ఓ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కి ఓకే చెప్పబోతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఇవి కాక, మరో రెండు మూడు ప్రాజెక్టులు రష్మి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయట.
అయితే, గతంలోలా వేగం వేగంగా హాట్ హాట్ సినిమాలు చేసెయ్యాలనే ఆలోచనతో కాకుండా, ఈసారి ఇంకొంచెం జాగ్రత్తపడుతోందట రష్మి. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వుంటోన్న రష్మి, మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకుంటోందనీ, ఈసారి రష్మి నుంచి మంచి మంచి సినిమాలు రాబోతున్నాయనీ అంటున్నారు. అదే నిజమైతే, రష్మికి వెండితెరపై బ్రైట్ ఫ్యూచ్ వుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.