సోషల్ మీడియా వచ్చాక... సెలబ్రెటీలు ఏదీ దాచుకోవడం లేదు. ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చినా బయట పెట్టేస్తున్నారు. అది ప్రేమ, కోపం, అసహనం.. ఇలా ఏదైనా సరే. తాజాగా రష్మి ఈ సమాజంపై తన ఆవేదనని వ్యక్తం చేసింది. `మానవత్వం చచ్చిపోయింది... ఈ భూమిపై మానవజాతి అంతరించే సమయం ఆసన్నమైంది` అంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచింది. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. రష్మీకి.. మూగ జీవాలంటే చాలా ఇష్టం. కరోనా సమయంలో... ఆకలితో అలమటిస్తున్న వీధి కుక్కలకు ప్రతీరోజూ విధిగా ఆహారాన్ని అందించేది.
ఇప్పటికీ వాటిపై అదే ప్రేమ చూపిస్తోంది. అయితే ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన జరిగింది. దీపావళి రోజున కొందరు ఆకతాయి కుర్రాళ్లు ఓ వీధి కుక్కపై తమ సైకోయిజాన్ని చూపించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై.. తోక తెగి పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీనికి సంబంధించిన వార్తని పోస్ట్ చేస్తూ...
''భూమి పై మనవజాతి అంతరించే సమయం వచ్చింది'' అంటూ కామెంట్ చేస్తోంది. రష్మిక పోస్ట్ కి మంచి స్పందన వస్తోంది. ఆ ఆకతాయిలని కఠినంగా శిక్షించాలని, ఇకపై ఇలాంటి దారుణమైన ఘటనలు జరక్కుండా చూడాలని ప్రభుత్వాలను, స్వచ్ఛంద సంస్థలకు నెటిజన్లు కోరుతున్నారు.