రొమాన్స్ కి వయసుకి లింక్ లేదని ఇప్పటికే బోలెడు మంది సెలబ్రీటీలు చెప్పారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న తారలూ వున్నారు. ఇప్పుడు క్రేజీ గర్ల్ రష్మిక మందన్న కూడా ఇదే మాట చెబుతుంది. ఆమె లేటెస్ట్ సినిమా‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ హీరో. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ తెగ సందడి చేస్తుంది రస్మిక. తాజగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో తన పర్శనల్ సంగతులు కూడా పంచుకుంది.
మీకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రస్మిక..'' పెద్ద అందగాడు అక్కర్లేదు. కానీ ఫ్రాంక్ గా ఉండాలి. సెన్స్ అఫ్ హ్యుమర్ వుండాలి. అతడితో చాలా సమయం గడపాలని అనిపించాలి. అన్నట్టు నాకు ఏజ్ లిమిట్స్ లేవు. నా దృష్టిలో రొమాంటిక్గా ఉండేందుకు వయసుతో పనిలేదు. నాకంటే పెద్దవాడైనా చిన్నవాడైననా మనసు నచ్చితే చాలు'' అని నిర్మొహమాటంగా చెప్పిందీ కన్నడ కస్తూరి.