కన్నడ బ్యూటీ రష్మిక మండన్న తెలుగు తెరపై అడుగుపెట్టనుందట. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తోనట. ఈ ప్రచారం ఎప్పటినుంచో జోరుగానే కొనసాగుతోంది. కానీ ఇంతవరకూ అధికారికంగా ప్రకటన కాలేదు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచియత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వక్కంతం వంశీ తొలిసారిగా మెగా ఫోన్ పట్టననున్నాడు. ఈ చిత్రం కోసమే రష్మిక మండన్న పేరుని పరిశీలిస్తున్నారు. అయితే రష్మికకి ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. దాంతో సినిమాల్లో ఆమె నటించడంపై అనుమానాలున్న మాట వాస్తవమే. 'కిరిక్ పార్టీ'తో రష్మిక మండన్న కన్నడలో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. దాంతో ఆమె తెలుగులో తెరంగేట్రం చేయకపోయినా ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇంకో వైపున ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో' సినిమా కోసం కూడా రష్మిక పేరు పరిశీలించారు. తెలుగులో ఎంట్రీకి ముందే ఇంతగా హాట్ టాపిక్ అయిపోయిన ముద్దుగుమ్మ రష్మిక మాత్రం ఇంకా తెలుగులో నటించడంపై ఇంతవరకు పెదవి విప్పలేదు. అమ్మడు ఓకే అంటే ఆఫర్లు వరదలా వెల్లువెత్తడానికి రెడీగా ఉన్నాయి. అవి కూడా స్టార్ హీరోస్‌తో జత కట్టేందుకు. మరి రష్మికదే లేటు.