నేషనల్ క్రష్ రష్మిక త్వరలో ఇంటర్ నేషనల్ క్రష్ గా మారుతుందేమో చూడాలి. అమ్మడి క్రేజ్ మాములుగా లేదు. భాష ఏదైనా కానీ రష్మిక లక్కీ చార్మ్ గా మారిపోయింది. రష్మిక ఉంటే ఆ లెక్కే వేరు 100 కాదు 1000 కోట్లు గ్యారంటీ. పాన్ ఇండియా సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రష్మిక క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారన్నది నిజం. రష్మిక కొత్త ఏడాదిలో 'చావా' మూవీతో బోణీ కొట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఈద్ కి సల్మాన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయటానికి రెడీ అయ్యింది. నెక్స్ట్ కుబేర తో జూన్ లో రానుంది. ఇదే ఏడాది 'గర్ల్ ఫ్రెండ్' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది.
తాజాగా రష్మికకి సంబందించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. రష్మిక కోసం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందని టాక్. లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తారని తెలుస్తోంది. ఒక సౌత్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామలు విషయం కాదు అదంతా రష్మిక క్రేజ్ & డెడికేషన్. ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరోయిన్ కి దక్కని అరుదైన గుర్తింపు రష్మిక సొంతం చేసుకుంది. బాలీవుడ్ మేకర్స్ ఎవరూ ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టలేదు.
రష్మిక కూడా ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేసింది తప్ప లేడీ ఓరియెంటెడ్ కథలు చేయలేదు. కానీ 100 కోట్లు బడ్జెట్ వెనక్కి తెచ్చే సత్తా రష్మికకి ఉందని మేకర్స్ మాత్రం నమ్ముతున్నారు. పైగా రష్మిక నేషనల్ క్రష్ అన్ని భాషల్లోనూ బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఓటీటీ డీల్స్ కి రష్మిక క్రేజ్ హెల్ప్ అవుతుంది. సో 100 కోట్లు పెద్ద మ్యాటర్ కాదని మేకర్స్ ధీమా. ఈ మూవీ కోసం రష్మిక డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది అని టాక్.