ఈనాటి హీరోయిన్లు ముదిరిపోయారు. తమ కండీషన్లతో... నిర్మాతలకు చమట్లు పట్టిస్తున్నారు. పారితోషికం ఒక్కటే కాదు.. తమ సిబ్బందికి వేతనాల్ని, వాళ్ల దైనందిన ఖర్చుల్ని, వసతి, భోజన సదుపాయాల్నీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఓ హీరోయిన్ చేస్తున్న డిమాండ్లకు టాలీవుడ్ విస్తుపోతోందని, కక్కలేక మింగలేక నిర్మాతలు అవస్థలు పడుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రష్మికపై కూడా ఓ రూమర్ గట్టిగా హల్ చల్ చేస్తోంది. ఈ అమ్మడు.. తనతో పాటుగా షూటింగులకు తన కుక్క పిల్లని కూడా తసీఉకొస్తోందని, ఆ కుక్క పిల్లకు సంబంధించిన ఫ్లైట్ టికెట్‌ని నిర్మాతే తీయాలంటూ డిమాండ్ చేస్తోందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ ఇంగ్లీష్ డైలీ ఈ వార్తని ప్రముఖంగా ప్రకటించింది. దీనిపై రష్మిక కూడా తనదైన స్టైల్ లో స్పందించింది.
ఈ వార్త చదివి తాను నవ్వలేక చచ్చానని, ఇలాంటి సిల్లీ వార్తని పోస్ట్ చేసి, నవ్వుకొనేలా చేసిన రిపోర్టర్‌కు ధన్యవాదాలు అంటూ... లైట్ తీసుకొంది రష్మిక. తనకొక కుక్కపిల్ల ఉంది. ఆరా అనే పేరుగల కుక్క పిల్లంటే రష్మికకు చాలా ఇష్టం. ``ఆరాకు... నాతో పాటు షూటింగులకు రావడం కంటే, ఎంచక్కా హైదరాబాద్‌లోనే ఉండడం ఇష్టం. నా కుక్క పిల్లపై చూపించిన కన్సర్న్‌కి ధన్యవాదాలు...`` అని పేర్కొంది రష్మిక. అంటే.. ఇవన్నీ రూమర్లే అని రష్మిక కొట్టిపారేసినట్టే కదా?