రావ‌ణాసుర'ట్రైల‌ర్ రివ్యూ: మాస్ రాజా ఇంకో హిట్టు కొట్టేలా ఉన్నాడు

మరిన్ని వార్తలు

ఇటీవ‌లే ధ‌మాకాతో ఓ సూప‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకొన్నాడు ర‌వితేజ‌. ఈ విజ‌యంతో ర‌వితేజ కెరీర్‌కు మ‌రింత బూస్ట‌ప్ ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో.. `రావ‌ణాసుర‌` సినిమాకీ పూర్తి చేశాడు. సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాత‌. ఏప్రిల్ 7న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ రోజు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. రెండు నిమిషాల నిడివి గ‌ల ట్రైల‌ర్ ఇది. మంచి యాక్ష‌న్ టింజ్‌తో మొద‌లైంది. ఆ త‌ర‌వాత‌.. ర‌వితేజ మార్క్ కామెడీ, రొమాన్స్ మొద‌ల‌య్యాయి. హైప‌ర్ ఆదితో ర‌వితేజ పంచ్‌లు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఆ త‌ర‌వాత‌. మ‌ళ్లీ యాక్ష‌న్ మోడ్ మొద‌లైంది.

 

''మ‌ర్డ‌ర్ చేయ‌డం క్రైమ్‌ దొర‌క్కుండా మ‌ర్డ‌ర్ చేయ‌డం ఆర్ట్‌ .. ఐ యామ్ ఏన్ ఆర్టిస్ట్ - రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ..''

 

''వాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు.. లా చ‌దివిన క్రిమినల్''

 

''ఈ భూమ్మీద న‌న్ను ఆప‌గ‌లిగిన వాడు ఎవ‌డైనా ఉన్నాడంటే.. అది నేనే..''

 

లాంటి డైలాగులు ఈ ట్రైల‌ర్ హీట్ అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో ట్రైల‌ర్‌లోనే చెప్పేశారు. ర‌వితేజ స్పీడుకి, టెక్నిక‌ల్ అంశాలూ దోహ‌దం చేశాయి. మేకింగ్ హై లెవ‌ల్‌లో ఉంది. జ‌య‌రామ్‌, ముర‌శీ శ‌ర్మ‌, సుమంత్.. ఇలా ఆర్టిస్టులు కూడా బాగానే క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో న‌లుగురు క‌థానాయిక‌లున్నారు. వాళ్ల‌కీ ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు ద‌క్కిన‌ట్టే అనిపిస్తోంది. మొత్తానికి ట్రైల‌ర్‌లో హిట్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS