మహేష్ సినిమాలో రవీనా టాండన్

మరిన్ని వార్తలు

పాన్ వరల్డ్ దర్శుకుడు రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో ఒక సినిమా అనౌన్స్ చేసి, స్క్రిప్ప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు టాక్. మహేష్ రాజమౌళి కాంబో మొదటిసారి కావటంతో ఈ ప్రాజెక్ట్  పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకొక న్యూస్ వైరలవుతోంది. కానీ వీటిపై మూవీ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  అసలు సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియటం లేదు. మొదట ఉగాదికి అన్నారు, తరవాత శ్రీ రామ నవమి అన్నారు కానీ అదీ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ మహేష్ పుట్టినరోజు సంధర్భంగా ఆగస్టు 9 న ఈ మూవీ డీటెయిల్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫాన్స్. 


ప్రజంట్ ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. రవీనా టాండన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి తరవాత పెళ్లి చేసుకుని సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.  ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. KGF సినిమాలో పొలిటికల్ లీడర్ గా, CM  గా పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. దీనితో  రవీనా కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలో కీలక పాత్రకి ఈమే అయితే బాగుంటుందని జక్కన్న సంప్రదించగా, రవీనా కూడా ఈ గోల్డెన్ ఛాన్స్ ని వినియోగించుకునేందుకు సిద్ధం అయినట్టు సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS