మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాతో సంక్రాతి బరిలో నిలిచి, మళ్ళీ తప్పుకున్నారు. ఒకేసారి అన్ని సినిమాల రిలీజ్ వలన ఏర్పడ్డ థియేటర్స్ కొరత కారణంగా, ఫిల్మ్ చాంబర్ పెద్దల నిర్ణయంకి మద్దతుగా ఈగల్ ని వాయిదావేశారు. నెక్స్ట్ తన ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టారు. రీసెంట్ గా రవి తేజ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. రవి తేజ ను వరస ప్లాప్ లు వెంటాడుతున్నాయి. ఖిలాడీ, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపులతో రవితేజ మార్కెట్ పడిపోయిందని, ఈ కారణంతో ఆయన డిమాండ్ చేస్తున్నంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడుతున్నారని తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలోనే ఒకటి రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని కూడా టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన పేమెంట్ తీసుకునే రవితేజ, లాస్ట్ కి ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో మూవీస్ చేయడానికి ఒప్పుకున్నాడు అని సమాచారం. రవి తేజకి ఉన్న ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగ్, కామెడీ టైమింగ్ కారణంగా ఇన్నాళ్లు హిట్ లేకపోయినా అవకాశాలు తగ్గలేదు. కానీ ఇప్పుడు టైమ్ మారింది. ఎవరు రిస్క్ చేయటానికి రెడీగా లేరు. ఇప్పటివరకు ఆయన డిమాండ్లను ఒప్పుకుంటూ వచ్చిన నిర్మాతలు ఇప్పుడు మాత్రం ససే మిరా అంటున్నారు. అందుకే మాస్ రాజా కొంచెం తగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ .
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ద్వారా ఈ ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ స్టార్ట్ చేసాడని ఫిల్మ్ వర్గాల టాక్. సినిమాకు పెట్టిన పెట్టుబడులు పోగా, వచ్చిన లాభాలను షేర్ చేసుకునే విధంగా, ఒప్పందం కుదుర్చుకున్నట్టు, హరీష్ శంకర్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం మెచ్చుకోదగింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.