రవితేజ న్యూ బిజినెస్ ఇదే!

మరిన్ని వార్తలు

హీరోలు, హీరోయిన్స్ ఒక వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ బిజినెస్ లో కూడా నంబర్ వన్ గా కొనసాగుతున్నారు. కొందరు ప్రొడక్షన్ హౌస్ లు స్టార్ట్ చేస్తున్నారు, కొందరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు గడిస్తుంటే, కొందరు కన్స్ట్రక్షన్ బిజినెస్, ఇంకొందరు రెస్టారెంట్స్   నడుపుతున్నారు. మన టాలీ వుడ్ స్టార్స్ మాత్రం థియేటర్ బిజినెస్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.  మ‌ల్టీప్లెక్స్‌లు ప్రారంభిస్తున్నారు. ఈ వైపుగా మొద‌ట‌గా అడుగులు వేసింది  మ‌హేష్‌బాబు.  'ఏఎంబీ' పేరుతో హైద‌రాబాద్‌లో కొండాపూర్ లో  మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ప్రారంభించారు.  ఈ మాల్ తో లాభాలు గడిస్తూ తిరుగులేని బిజినెస్ మాన్ అయ్యాడు మహేష్.  మహేష్ ని ఆదర్శంగా తీసుకుని అల్లు అర్జున్ కూడా  'ఏఏఏ' పేరుతో థియేట‌ర్ నిర్మించాడు. నెక్స్ట్ విజ‌య్ దేవ‌ర‌కొండ  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 'ఏవీడీ' థియేట‌ర్‌ను ర‌న్ చేస్తున్నాడు. ఏషియ‌న్ సంస్థ భాగ‌స్వామ్యంతో మ‌హేష్‌, బ‌న్నీ, విజ‌య్ దేవ‌ర‌కొండ థియేట‌ర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.


ఇప్పుడు మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. హైద‌రాబాద్‌లో దిల్‌షుక్‌న‌గ‌ర్‌లో ఓ మ‌ల్లీప్లెక్స్ థియేట‌ర్ నిర్మించ‌నున్న‌ట్లు టాక్. ఈ మ‌ల్టీప్లెక్స్‌కు ఏషియ‌న్ ర‌వితేజ పేర్లు కలిసి వచ్చేలా 'ఏఆర్ టీ సీనిమాస్' అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. టోటల్ గా  ఆరు స్క్రీన్ల తో ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ రెడీ  అవుతోంది. ఈ ఏడాదిలోనే ఏషియ‌న్ ర‌వితేజ ప్రారంభం కానుందని, త్వరలో ఈ విషయాన్ని అఫీషియ‌ల్ అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు సమాచారం.


రవి తేజ్ కెరియర్ ఒక్క హిట్ మూడు ప్లాఫులతో సాగుతోంది. క్రమంగా మార్కెట్ కూడా తగ్గుతోంది. ఇంతకముందు రవి తేజ పై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు  ముందుకొచ్చేవారు కానీ ఇప్పుడు ఎవరూ అంత సాహసం చేయటం లేదు. కెరియర్ డౌన్ అవటం తో  భవిష్యత్తుకోసం రవి తేజ ఇలా బిజినెస్ పై పెట్టుబడి పెడుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.  ఓ వైపు హీరోగా న‌టిస్తూనే ప్రొడ్యూస‌ర్‌గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన చిన్న సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS