రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరబాద్ లోని చార్మినార్ కి షిఫ్ట్ అయ్యింది. చార్మినార్ వద్ద కొత్త షెడ్యుల్ మొదలుపెడుతున్నట్లు శంకర్ ఒక ఫోటోని షేర్ చేషూర్.
సినిమా విషయానికి ఇందులో చరణ్ రెండు విభిన్న గెటప్పులో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే పొలిటికల్ నేపధ్యం వున్న మరో గెటప్‌లో అలరించనున్నారట. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సర్కారోడు, అధికారి అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. తమన్ బాణీలు అందిస్తున్నారు.