మలయాళ హీరో దిలీప్ ఇప్పుడు కొచ్చి సెంట్రల్ జైలులో కటకటాలు లెక్కపెడుతున్నాడు. ఆయనకి మలయాళ ఇండస్ట్రీలో నే గాక కేరళ ప్రజల్లో కూడా చాలా మంచి పేరుంది. ఆయన అభిమానులు ఇష్టంగా ‘జనప్రియ నాయకన్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
అలాంటి పేరున్న దిలీప్ ఇలాంటి పనిచేసాడు అన్న నిజాన్ని అయన అభిమానులు జీర్ణించుకోలేపుతున్నారు. అయితే భావనని కిడ్నాప్ చేయించడానికి దిలీప్ కి ఆమె పై కక్ష కారణంగానే ఇది జరిగింది అన్న విషయం ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది.
అయితే పోలీసులు మాత్రం పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ దిలీప్ పాత్ర ఈ కేసులో ప్రముఖంగా ఉన్నందునే ఆయన కస్టడీ కోరినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమ సంఘం నుండి ఆయనని బహిష్కరించగా, ఆయన అభిమానులు సైతం దిలీప్ ని శిక్షించండి అంటూ ట్వీట్స్ పెడుతుండడం గమనార్హం.