అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరిచేస్తున్నారు. సినిమా సందడి మళ్లీ మొదలు కాబోతోంది. తొలి సినిమాగా తన కరోనా వైరస్ విడుదల చేస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించేశాడు. అయితే.. రామ్ `రెడ్` కూడా అక్టోబరు 15నే రాబోతోందని టాక్. రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు భారీ ఎత్తున వచ్చాయి. కానీ.. రామ్ ఒప్పుకోలేదు.
`ఇస్మార్ట్ శంకర్` లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తరవాత రామ్ చేసిన సినిమా ఇది. థియేటర్లలో విడుదలైతే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అందుకే... ఓటీటీ ఆఫర్లు ఊరించినా, ఇవ్వలేదు. రామ్ ఎదురు చూపులు ఫలించాయి. థియేటర్లు తెరచుకుంటున్నాయి. దసరా సీజన్ కావడంతో అక్టోబరు 15నే సినిమాని వదలాలని రామ్ భావిస్తున్నాడట. ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ రావొచ్చు.