రొమాంటిక్ సీన్స్‌లో అందాల భామ రెచ్చిపోవడం కొత్తేమీ కాదు. అందానికి అందం, నటనకు నటన అన్నీ ఉన్నా కమర్షియల్ సక్సెస్‌లు అందుకోవడంలో వెనుకబడుతోంది ఈ బ్యూటీ. అయితే ఆమె టాలెంట్‌ని గుర్తించి సరైన అవకాశాలు ఇవ్వడంలో దర్శక నిర్మాతలు ఎప్పుడూ ముందే ఉంటున్నా, సరైన సక్సెస్ కూడా దొరకాలి కదా. ఈ బ్యూటీ లేటెస్ట్ తమిళ మూవీ 'శరవణ ఇర్కు భయమేన్' సినిమాలో రెచ్చిపోయింది.
హీరో ఉదయనిథి స్టాలిన్‌తో కలిసి ఓ రొమాంటిక్ పాటలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టేసింది. నిజానికి ఇలాంటి పాటల్లో హద్దులు మీరిన ఎక్స్‌పోజింగ్‌కి ఆస్కారముంటుంది. అయితే లిమిటెడ్ గ్లామర్‌తోనే అన్లిమిటెడ్ హాట్‌నెస్‌ని పండించేసి తన ప్రత్యేకతను చాటుకుంది రెజినా. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఈ పాటలో కిల్లింగ్ అంతే. ఇంటర్నెట్లో ఈ పాట వైరల్‌గా మారింది. తమిళంలో తనకు ఈ సినిమా బిగ్ సక్సెస్ అందిస్తుందని రెజినా ఎంతో నమ్మకంతో ఉంది. ఇంకో వైపున తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' సినిమా తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమని రెజినా చెబుతోంది. అక్కడ 'శరవణన్..', ఇక్కడ 'నక్షత్రం' ఈ రెండు సినిమాలతో అందాల భామ రెజినా, సూపర్బ్ హిట్స్ అందుకోవాలని ఆశిద్దాం.