రేణూ దేశాయ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘‘అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్నేళ్ళుగా గుండె సంబంధ సమస్య,మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. నాలానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ధైర్యాన్నివ్వడం కోసం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలి’’ అని చెప్పుకొచ్చారు రేణూ.
కొన్నాళ్ళుగా రేణు దేశాయి సినిమాల్లో అంత యాక్టివ్ గా లేరు. గతంలో ఆమె దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. అయితే తర్వాత ఆమె దర్శకత్వంలో సినిమాలు రాలేదు. రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు లో హేమలత లవణం పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది.