వెంకీ పాటకి ఊపొచ్చింది

మరిన్ని వార్తలు

ఇంతవరకూ చాలా మంది హీరోలు తమ గొంతు సవరించుకున్నారు. కానీ వెంకీ మాత్రం ఎందుకో ఇంట్రెస్ట్‌ చూపలేదు. తొలిసారిగా వెంకీ 'గురు' చిత్రంతో ఆ పని చేశాడు. ఆయన ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చాడు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్‌ని వెంకీ గొంతుతో మొదలైన ఈ పాటతోనే విడుదల చేశారు. అయితే ఈ పాట మొదట్లో అంతగా కిక్కివ్వలేదు. ఇదేం పాట అనుకున్నారు మొదట్లో అంతా. కానీ ఈ పాట ఇప్పుడు భలే కిక్కెక్కిస్తోంది. ఈ పాట మేకింగ్‌ వీడియో బయటకి వచ్చినప్పట్నుంచీ ఈ పాటకి మాంచి ఊపొచ్చింది. క్రేజ్‌ పెరిగింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట. ఎఫ్‌ ఎమ్‌ల్లోనూ, యూ ట్యూబ్‌ల్లోనూ చివరికి ఆటోల్లోనూ, బస్సుల్లోనూ కూడా ఇదే పాట. అంతగా ఈ పాట మార్మోగిపోతోంది. పాట కన్నా పాట సందర్భంలోని వెంకీ హావభావాలు, ఈజ్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. దానికే జనం ఫిదా అయిపోతున్నారు. 2017కి బెస్ట్‌ సాంగ్‌ అయిపోయేలా ఉంది ఈ పాట. మొదట్లో ఇలాంటి పాటలు నెగిటివ్‌ ఇంపాక్ట్‌నిస్తాయి. కానీ తర్వాత జనాల్లోకి వెళ్లిపోతాయి. ఈ పాటకి అదే జరిగింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌ చూస్తుంటే ఈ సినిమాకి హిట్‌ పక్కా అనిపిస్తోంది. కాన్సెప్ట్‌ కూడా కొత్తగా ఉంది. రీమేక్‌ సినిమానే అయినా కానీ వెంకీ స్టైల్‌కి కొత్తగా అనిపిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒరిజినల్‌లో నటించిన రితికాసింగ్‌ ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS