పవన్ కల్యాణ్ సినిమా అనగానే, ఏపీ ప్రభుత్వానికి ఎక్కడ లేని నిబంధనలు గుర్తొస్తుంటాయి. పవన్ కల్యాణ్ సినిమాల్ని టార్గెట్ చేయడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం అయిపోయింది. తాజాగా `భీమ్లా నాయక్` విషయంలోనూ ఇదే నిరూపితమైంది.
శుక్రవారం భీమ్లా నాయక్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఏపీలో కొత్తగా సవరించిన రేట్లకే టికెట్లు అమ్మాలని, టికెట్ ధరలు ఎక్కడైనా పెంచినట్టు తెలిస్తే, చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే థియేటర్ యజమానులకు నోటీసులు పంపారు. బెనిఫిట్ షోలూ, ఫ్యాన్స్ షోలూ రద్దు చేశారు.
నిజానికి డిసెంబరులో వచ్చిన అఖండకీ ఇవే రూల్స్ వర్తించాలి. కానీ.. అఖండని ఎవరూ పట్టించుకోలేదు. టికెట్ రేట్లు అమ్మినా, ఆ సినిమా జోలికి వెళ్లలేదు. పుష్ప విషయంలోనూ ఇదే జరిగింది. ఈ రెండు సినిమాలకూ లేని రూల్స్, భీమ్లా నాయక్ విషయంలో ఎందుకన్నది ఫ్యాన్స్ ప్రశ్న. కచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యే. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 5 ఆటలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకూ పచ్చ జెండా ఊపేసింది. ఓ సినిమా విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రకాలుగా ఆలోచించడం, బహుశా ఇదే మొదటిసారేమో..?