విజయవాడలో నిన్నటిరోజున వంగవీటి రంగ,రాధల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా వారి కుటుంబసభ్యులు, మాజీ ఏంఎల్ఏ లు అయిన వంగవీటి రత్నకుమారి ఆమె కుమారుడు వంగవీటి రాధలు ఖండించారు.
ఇక దీనిపై నిరసన తెలిపిన వీరిరువురిని పోలీసులు అరెస్ట్ చేసి పరిస్థితిని తమ అదుపులోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా వారిరువురు పోలీసులతో బాహాబాహికి దిగారు, ఆ సమయంలోని వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ ఫోటోల పై దర్శకుడు ఆర్జీవీ తన మార్కు సెటైర్లు వేశాడు. వంగవీటి సినిమా సమయంలో ఆ సినిమా పై వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే.
ఈ తరుణంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరీ ఈ కామెంట్స్ పై వంగవీటి కుటుంబసభ్యులు ఎలా స్పందిన్చనున్నారో వేచి చూడాలి.