తెలుగు చిత్రసీమకు అంతగా ఎక్కని.. టాపిక్ లెస్బియన్ గోల. ఎంత ఎదిగినా, ఎంత పోలీష్ గా ఉన్నా, ఎంత ఆధునికతని సంతరించుకున్నా - ఆడ - ఆడ మధ్య శృంగారాన్ని జీర్ణించుకోలేం. సినిమాలో ఒకట్రెండు సన్నివేశాల్లో లెస్సియన్ సంస్కృతిని చూపించాలనుకున్నా హడలే. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం. కానీ వర్మ మాత్రం ఇప్పుడు లెస్బియన్ కథతో ఓ సినిమానే తీసేశాడు. దానికి `డేంజరెస్` అనే టైటిల్ పెట్టేశాడు.
భారతదేశంలో తొట్టతొలి లెస్బియన్ మూవీ... అంటూ ప్రకటించుకున్నాడు వర్మ. ఇద్దరు అమ్మాయిలు చాలా ఘాటుగా లిప్పులాక్ పెట్టుకుంటున్న పోస్టర్‌ని ఫస్ట్ లుక్‌గా విడుదల చేసేశాడు. ఇందులో క్రైమ్, గ్యాంగ్ స్టర్‌ల గోల కూడా ఉంటుందని చూచాయిగా హింట్ ఇచ్చాడు వర్మ. `దైర్ ఎఫైర్ కిల్డ్ మెనీ.. ఇన్‌క్లూడింగ్ కాప్ అండ్ గ్యాంగ్ స్టర్స్` అనే ట్యాగ్ లైన్ ఇచ్చాడు. దీన్ని కూడా ఏటీటీలోనే విడుదల చేస్తున్నాడు.
లెస్బియన్ అనగానే.. మహిళా సంఘాల నిరసన సెగ తప్పకుండా ఉంటుంది. వాళ్లని రెచ్చగొట్టి - తన సినిమాకి ఎప్పట్లానే పబ్లిసిటీ తెచ్చుకునే పనిలో ఉన్నాడు.. వర్మ. టీజరో, ట్రైలరో వస్తే... ఆ కాంట్రవర్సీ కాస్త మొదలైపోతుంది.