నటిగా ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఇప్పుడు హీరోయిన్‌గా రాణించాలంటే గ్లామర్ తప్పనిసరి. ఆ విషయం రితికా సింగ్ కూడా గుర్తించినట్టుంది. 'గురు' సినిమాతో ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఈ బ్యూటీ త్వరలో 'శివలింగ'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలి సినిమా 'గురు'లో హాట్ అప్పీల్‌కి అవకాశమే లేదు. ఆ సినిమాలోని కంటెంట్ అలాంటిది. ఆమె తప్ప ఇంకెవరూ చేయలేని పాత్ర అది. ఈ మాటకన్నా గొప్ప గుర్తింపు రితికా సింగ్‌కి ఇంకేముంటుంది? అయినప్పటికీ కూడా గ్లామరస్ హీరోయిన్‌గా రాణించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ఈ భామకి హాట్ అప్పీల్ ఇష్టమట. గ్లామరస్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నానంటోంది రితికా సింగ్. చిన్నప్పటినుంచీ ఆమెకి బాక్సింగ్‌పై అవగాహన ఉంది. దాంతో 'గురు' సినిమాలో తేలిగ్గా నటించేసిందట. డాన్సులు చేయడమంటే మొదట్లో కష్టమనిపించిందిగానీ, ఇప్పుడు ఇష్టంగా మారిందట. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌కి గ్లామర్‌తోపాటు డాన్సింగ్ స్కిల్స్ కూడా ఉండాలి మరి. 'గురు' సినిమా కోసం ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించినా, చాలా సెన్సిటివ్ అట. అయితే స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్డ్ మైండ్‌సెట్ తన ప్రత్యేకత అంటోంది. ఓ అవార్డుల ఈవెంట్‌లో గ్లామర్ అవతార్‌లో కనిపించి షాకిచ్చింది కూడా. గ్లామరస్ టచ్ తనకీ కావాలని రితికా సింగ్ అనడమే లేటు, ఆమె ముందు అలాంటి పాత్రలు వాలిపోతాయ్. ఇప్పటికే నటిగా నిరూపించేసుకుంది గనుక గ్లామరస్ హీరోయిన్ అవడం పెద్ద కష్టం కాదామెకి.