ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించేసింది రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం 'బాహుబలి' సినిమా. అలాంటి 'బాహుబలి' రికార్డులు కొట్టేయాలన్న తాపత్రయం తాజాగా 'రోబో 2.0' నిర్మాతల్లో కనిపిస్తోంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. 'బాహుబలి' సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం మార్కెటింగ్ స్ట్రాటజీసే. అలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని ఈ సినిమా విషయంలోనూ పక్కాగా అమలు చేస్తారట 'రోబో 2.0' చిత్ర యూనిట్. రజనీకాంత్‌కి ఉన్న స్టార్‌డమ్ నేపథ్యంలో ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో రావొచ్చునని అంచనాలున్నాయి. ఎంతైనా ఈ సినిమాతో 'బాహుబలి' మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే అది సస్పెన్సే. ఓ సినిమాని మించిన విజయం ఇంకోటి వచ్చినప్పుడే పోటీ తత్వం పెరుగుతుంది. 'బాహుబలి ది కంక్లూజన్'ని దాటి 'దంగల్' వసూళ్ళు సాధిస్తోంది చైనాలో విడుదలయిన తర్వాత. 'బాహుబలి' చైనాలో విడుదలయితే మళ్ళీ కొత్త రికార్డులొస్తాయి. అప్పుడు పోటీ మళ్లీ స్టార్ట్ అవుతుంది. చైనాలో రజనీకాంత్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అక్కడా పోటీ తప్పదు. ఇంతవరకూ 'దంగల్', బాహుబలి' చిత్రాలు వసూళ్ల రేసులో పోటీ పడగా, తాజాగా ఆ జాబితాలోకి 'రోబో 2.0' వచ్చి చేరింది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు ఈ సినిమాలో. అమీజాక్సన్ రజనీకాంత్‌కి జోడీగా నటిస్తోంది.