అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రజినీకాంత్ కొత్త చిత్రం రోబో 2.0 ఇప్పుడు ఒక సంచలనం సృష్టించింది.
అదేంటంటే, రోబో 2 చిత్ర శాటిలైట్ హక్కులని ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన జీ టీవీ సొంతం చేసుకున్నట్టు సమాచారం. అయితే మూడు భాషల్లో (తెలుగు, తమిళ & హిందీ) కలిపి మొత్తంగా రూ 110 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్మినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.