పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రోగ్'. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఇషాన్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. మంచి ఫిజిక్, యాక్టింగ్‌లో ఈజ్ ఇవన్నీ ఇషాన్‌ని హీరోగా నిలబెట్టేలానే ఉన్నాయి. 'రోగ్' ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఇషాన్‌కి తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పక తప్పదు. తొలి సినిమా అనగానే నెర్వస్‌నెస్ ఉంటుంది. కానీ అదేమీ అతనిలో కనిపించలేదు. తెరపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. మాస్ హీరోగా సత్తా చాటడం, రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసేయడం ఎంతో అనుభవం ఉన్న వారికే కష్టం. అలాంటిది తొలి సినిమాతోనే కంప్లీట్ హీరో అనిపించుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటేనే నిలదొక్కుకోగలరు. ఆ టాలెంట్ ఇషాన్‌లో మెండుగా ఉంది. తొలి సినిమాకే ఇన్ని మార్కులేయించేసుకున్నాడంటే, రెండో సినిమాకి రాటుదేలిపోతాడు. అందులోనూ ఎంట్రీనే పూరీ జగన్నాధ్ సినిమాతో ఇవ్వడం ఇషాన్‌కి ప్లస్ పాయింట్. ఏ హీరో అయినా పూరీతో సినిమా చేస్తే హీరోగా పరిణీతి చెందుతారని భావిస్తారు. అయితే తొలి సినిమాతోనే పూరీ డైరెక్షన్‌లో చేసే ఛాన్స్ దక్కించుకున్న ఇషాన్ చాలా లక్కీ. ఈ సినిమాలో ఇషాన్‌కి జోడీగా మనారా చోప్రా, ఏంజెలా హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరు కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ అన్నీ కలగలిసిన 'రోగ్' టోటల్‌గా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.