పోటీ కోసం రాలేదు: రోషన్ కనకాల

మరిన్ని వార్తలు

'బబుల్‌గమ్' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు సుమ, రాజీవ్ కానకాల కుమారుడు రోషన్. కొత్తతరం ప్రేమకథతో ఈ సినిమాని రూపొందించారు. ట్రైలర్, టీజర్ లో మంచి మార్కులు కొట్టాడు రోషన్. సినిమా పరిశ్రమలోకి పరిచయం అవుతున్న సందర్భంలో తన మనసులో మాట పంచుకున్నాడు.


'నటన అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. పరిశ్రమలో పోటీపై నాకు ఆలోచన లేదు. పోటీ కోసం రావడం లేదు. నటించడం ఇష్టం. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడమే నా లక్ష్యం. పరిశ్రమలో అందరికీ చోటు వుంది. బావున్న ప్రతి సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే వచ్చాను'' అని చెప్పుకొచ్చాడు రోషన్.


అలాగే తన రంగు గురించి ఎదురుకున్న కొన్ని కామెంట్స్ పై ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. దిని గురించి చెబుతూ.. 'ఇది నా ఒక్కడి సమస్య కాదు. చాలా మంది ఎలాంటి వివక్షని ఎదురుకుంటారు. మనిషి విజయానికి అవి అడ్డంకులు కావని చెప్పడానికే ఆ వాఖ్యలు చేశానని చెప్పుకొచ్చాడు రోషన్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS