కరోనా కారణంగా షూటింగులన్నీ బందైపోయాయి. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చాక - మాక్ షూటింగ్ చేద్దామని అనుకున్నాడు రాజమౌళి. కానీ అది సాధ్యం కాలేదు. తక్కువ సిబ్బందితో షూటింగ్ చేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అదీ కుదర్లేదు. ఆ తరవాత.. రాజమౌళి కుటుంబానికి కరోనా సోకడం, వాళ్లంతా హోం క్వారెంటైన్ కి పరిమితం అవ్వడంతో `ఆర్.ఆర్.ఆర్` నిరవధికంగా వాయిదా పడిపోయింది.
ఇప్పుడు రాజమౌళి ఆరోగ్యం కుదుట పడింది. `ఆర్.ఆర్.ఆర్` ప్లానింగులు మళ్లీ మొదలయ్యాయి. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. దసరా తరవాత.. ఈ సినిమాని పట్టాలెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ వేశారు. అక్కడే.. షూటింగ్ జరగబోతోందట. చాలా కాలంగా సెట్ వాడకపోవడం వల్ల కొంత భాగం పాడైందని, ఇప్పుడు ఆ సెట్ కి రిపేర్లు చేస్తున్నారని తెలుస్తోంది.