ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: ఆర్.ఆర్.ఆర్ ( రౌద్రం రణం రుధిరం)
నటీనటులు: జూ. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్గన్ మరియు ఒలీవియా మోరిస్
కథ: కె. వి. విజయేంద్ర ప్రసాద్
కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్ కుమార్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాత: డివివి దానయ్య
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి


మూవీ రేటింగ్: 3.5/5


ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి, యమదొంగ ఇండస్ట్రీ హిట్లు. రామ్ చరణ్ 'మగధీర' అప్పటి వరకూ వున్న ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొట్టింది. ఈ మూడు సినిమాలు అందించిన దర్శక ధీరుడు.. రాజమౌళి. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో అపజయం అంటూ ఎరుగని రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ ని ఒకే ఫ్రేములోకి తెచ్చి 'ఆర్ఆర్ఆర్' పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించారు. 'బాహుబలి' తో తెలుగు సినిమా ఖ్యాతిని పదింతలు పెంచిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ని కూడా అదే స్థాయిలో తెరకెక్కించారు. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలసి నటించడం, అల్లూరి, కొమరం భీమ్ నేపధ్యాలు తీసుకోవడం.. ఇలా ఆకాశాన్ని తాకే భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలని ఆర్ఆర్ఆర్ అందుకుందా ? ఎన్టీఆర్, చరణ్ కలయిక వెండితెరపై ఎలాంటి వినోదాన్ని పంచింది? అసలు ఏమిటీ ఆర్ఆర్ఆర్ కథ ?
 

కథ: 1920 లో కథ మొదలౌతుంది. రామ‌రాజు (రామ్‌చ‌ర‌ణ్‌) బ్రిటిష్ ప్రభుత్వంలో నిబద్దత గల పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. ప్రభువుల మెప్పు పొంది ప‌దోన్నతి పొందాలనేదే అత‌ని ఆశ‌యం. ఇదే సమయంలో బ్రిటిష్ గవ‌ర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) త‌న కుటుంబంతోపాటు ఆదిలాబాద్‌ ప్రాంతానికి వస్తాడు. అక్కడ గోండు జాతికి చెందిన మ‌ల్లి అనే చిన్నారిని వాళ్లతోపాటే దిల్లీకి తీసుకెళతాడు. ఈ గోండు జాతిని ర‌క్షించే కాప‌రి  భీమ్ (ఎన్టీఆర్‌). ఆ పాప‌ని బ్రిటీష్ వారి నుంచి తీసుకురావ‌డానికి ఢిల్లీ వెళ్తాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. పాప‌ని ఎత్తుకెళ్లడానికి ఓ గోండు జాతి వీరుడొచ్చాడ‌ని తెలిసి అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి రామ్ ని నియ‌మిస్తుంది బ్రిటీష్‌ ప్రభుత్వం. అయితే ఆ తిరుగుబాటు దారుడు భీమ్ అనే సంగ‌తి తెలీక‌.. త‌న‌తో దోస్తీ చేస్తాడు రామ్. ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. తర్వాత ఏం జరిగింది ? భీమ్ పాపని వెనక్కి తీసుకురాగలిగాడా ? రామ్ , భీమ్ ని బంధీ చేశాడు ? వీరి దోస్తీ చివరకు ఏమైయింది ? అనేది మిగతా కథ.  

 
విశ్లేషణ:  ప్రేక్షకులని అలరించే ఫార్ములా బహుశా రాజమౌళి పట్టుకున్నంతంగా మరొకరు పట్టుకోలేదనే మాట ఆతిశయోక్తి కాదు. 'స్టూడెంట్ నెంబర్ వన్' నుంచి 'బాహుబలి' వరకూ ఆయన చేసిన ప్రతి సినిమా అప్పటి వరకూ వున్న ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టిందే. ఇప్పుడు మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టే సినిమా ప్రేక్షకులు ముందుకు తెచ్చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కుంభస్థలం బద్దలైపోయింది.


ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇవ్వడంలో మాస్టర్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కూడా హైలీ ఎమోషనల్ అండ్ యాక్షన్ జర్నీ. ఈ సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ పాత్రల పరిచయాలు చూస్తే.. రాజమౌళి తన హీరోలని ఎంతగా ప్రేమిస్తాడో అర్ధమౌతుంది. ఇటు ఎన్టీఆర్ అటు చరణ్.. ఇద్దరి కెరీర్ లో ది బెస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఇకపై ఆర్ఆర్ఆర్ అనే చెప్పుకోవాలి. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ థియేటర్ లో మాస్ జాతర చేసుకునేలా డిజైన్ చేశారు ఎంట్రీలు. కొమరం భీమ్, అల్లూరి పాత్రల నేపధ్యం తీసుకోవడంతో హీరోయిజం పీక్స్ లో చూపించే అవకాశాన్ని రాజమౌళి క్రియేట్ చేసుకున్న విధానం అతని దర్శక ప్రతిభకు అద్దం పడుతుంది.


రాజమౌళి సినిమా సీన్స్ లో హై వుంటుంది. చాలా సాదారణమైన సీన్ ని కూడ అసాదరణంగా మార్చగల ప్రతిభవంతుడు రాజమౌళి. రామ్ భీమ్ ఓ బాబుని కాపాడుతున్న సీన్ చూస్తే.. ఇంత కామన్ సీన్ ని రాజమౌళి ఇంత థ్రిల్లింగా ఎలా తీసడబ్బా ? అనిపించక మానదు. రాజమౌళి లెక్క ఎప్పుడూ తప్పుదు. ఆయన మీటర్ చాలా చక్కగా పని చేస్తుంది. ఆర్ఆర్ఆర్ ని కూడా తన మీటర్ తో చక్కగా కొలిచేశాడు. ప్రతి పది నిమిషాలకు ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇవ్వడం రాజమౌళి స్పెషాలిటీ. ఆర్ఆర్ఆర్ లో కూడా ఆ లెక్క తప్పలేదు. కథ ప్రయాణం కొంచెం తగ్గుతుందనే సమయంలో మెరుపులా ఓ హై సీన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఉరుములా ఓ పాట వినోదాన్ని పంచుతుంది.


ఇలా ఆర్ఆర్ఆర్ మొదటి సగం గ్రిప్పింగా నడిపాడు రాజమౌళి. ఇక ఇంటర్ వెల్ బాంగ్ అయితే గూజ్ బంప్స్. సెకండ్ హాఫ్ పై స్కై లెవల్ అంచనాలు పెంచింది ఇంటర్వెల్ ఎపిసోడ్. అయితే మొదటి సగాన్ని టీట్వంటీ మ్యాచ్ లా ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడికి రెండో సగం మాత్రం వన్డే మ్యాచ్ లా కాస్త నిదానంగా అనిపిస్తుంది. ఒక రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వచ్చినపుడు రాజమౌళి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అల్లురి సీతరామా రాజుగా చరణ్ విశ్వరూపం, రామరాజు ఆశయాన్ని నెరవేర్చే భీమ్ ... అదిరిపోయే క్లైమాక్స్ .. ప్రేక్షకుడికి సీట్ ఎడ్జ్ వినోదాన్ని పంచుతాయి. చివర్లో ఎత్తుర జెండా టైటిల్ కార్డ్ చూసి .. మగధీరలో  ''ధీరమగధీర'' చూసి హ్యాపీగా బయటికి వచ్చిన ఫీల్ ని ఇస్తుంది.


నటీనటులు: ఎన్టీఆర్- చరణ్ .. బ్యాలన్స్ చేయడం అంత సులువు కాదు. కానీ రాజమౌళి పక్కగా కొలిచినట్లు ఇద్దరి పాత్రలని బ్యాలన్స్ చేశాడు. ఇద్దరి హీరోల పరిచయం తర్వాత ఎన్టీఆర్, చరణ్ కనిపించరు. కేవలం రామ్ , బీమ్ పాత్రలే కనిపిస్తాయి. నటన పరంగా ఎన్టీఆర్ , చరణ్ ది బెస్ట్ ఇచ్చారు. నాటు పాటలో వేసిన డ్యాన్స్ ఇరువురి అభిమానులు ఒక పండగ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ .. ఈ ఇద్దరితో తప్పా మరెవరితోను తీయలేం అనేంత చక్కగా కుదిరిపోయారు. అలియా భట్ పాత్ర నిడివి తక్కువే అయిన కీలకమైనది. అజయ్ దేవ్గన్ , శ్రియా తమ పాత్రలకు న్యాయం చేశారు, ఒలివియా మోరిస్ పాత్ర నిడివి కూడా తక్కువే. సముద్రఖని తో పాటు మిగతా నటులు పరిధిమేర చేశారు.


సాంకేతికంగా: రాజమౌళి- కీరవాణి కలయికకు తిరుగులేదని ఆర్ఆర్ఆర్ మరోసారి నిరూపించింది. పాటలన్నీ బావున్నాయి. నాటునాటు పాట నెక్స్ట్ లెవల్. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లో కీరవాణి అందించిన నేపధ్య సంగీతం మైండ్ బ్లోయింగ్. సాయి మాధవ్ బుర్రా డైలాగుల్లో పదును ఇంకా పెరిగింది. సెంథిల్ కెమెరా పనితనం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. విజువల్స్ అన్ని రిచ్ గా తీశారు. సినిమా అంతా లావిష్ గా వుంది. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా మంచి మార్కులు పడతాయి. అల్లూరి, భీమ్ కాలం నాటి పరిస్థితులు సహజంగా సృస్టించారు.అక్కినేని శ్రీకర్ ప్రసాద్ పక్కగా ఎడిట్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్  శ్రీనివాస్ మోహన్ కి కూడా మంచి మార్కులు పడాతాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు.


ప్లస్ పాయింట్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్
రాజమౌళి డైరెక్షన్
ఎమోషనల్, యాక్షన్ సీన్స్
పాటలు


మైనస్ పాయింట్స్  
సెకండ్ హాఫ్ లో కొంచెం సాగాదీత
రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్


ఫైనల్ వర్దిక్ట్ : ఆర్ఆర్ఆర్ .. బాక్సాఫీసు రారాజు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS