ఆర్ఆర్ఆర్ : కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ట్రైలర్

మరిన్ని వార్తలు

భారీ అంచనాల మధ్య ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మల్టీ స్టార్టర్ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకూ వున్న బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుందనే నమ్మకం కలిగించింది ఈ ట్రైలర్.

రాజమౌళి తన టేకింగ్ తో మరోసారి యావత్ దేశాన్ని అబ్బురపరిచాడు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, క్లాప్స్ కొట్టే డైలాగులతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనిపించింది. ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత విజల్స్ వేయించింది.

 

ట్రైలర్ లో కథ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చారు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన కొమరం భీంని నిలువరించే సరైన పోలీస్ అధికారి కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో రాంచరణ్ సరైన వ్యక్తి అని అతడిని రంగంలోకి దింపుతారు. అప్పటి నుంచి భీం, రామ్ మధ్య వార్ మొదలవుతుంది. అయితే వారి మధ్యలో స్నేహం ఉండేలా చూపించడం స్క్రీన్ ప్లే ట్విస్ట్ లా అనిపిస్తుంది. కధ రెండు కాలాల్లో నడుస్తున్న ఫీల్ ట్రైలర్ లో కనిపించింది. ఎలివేషన్లు వీర లెవల్ లో వున్నాయి. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమాగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కీరవాణి నేపధ్య సంగీతం వేరే స్థాయిలో వుంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS