తెలుగు పాట చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కైవసం చేసుకొంది. ఆర్.ఆర్.ఆర్‌లోని నాటు నాటు పాటకు ఈ పురస్కారం దక్కింది.
నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ కి నామినేషన్ పొందిన దగ్గర్నుంచి అందరి చూపూ.. ఈ పురస్కారం పై పడింది. మనకు గోల్డెన్ గ్లోబ్ వస్తుందా? రాదా? అంటూ ఆసక్తితో ఎదురు చూశారు. ఈ రోజు ఉదయం కాలిఫోర్నియా అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.
నాటు నాటుకి అవార్డు ప్రకటించగానే.. ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్... ఉత్సాహంగా కేరింతలతు కొట్టింది. అవార్డు అందుకొంటూ కీరవాణి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ అవార్డు ఘనత రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, ఎన్టీఆర్, చరణ్, కాలభైరవలదే... అని ప్రకటించారు. రాజమౌళి కంపోజ్ చేసిన ఈ పాటని చంద్రబోస్ రాశారు. కాలభైరవ, సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు. ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. తెలుగు పాటని విదేశీయులు కూడా వేదికలపై ఆలపించి ఆశ్చర్యపరిచారు. ఈ పాట ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటరిగీలో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. ఆస్కార్ కల కూడా నెరవేరితే... నాటు నాటు పాట.. మరో సరికొత్త చరిత్ర సృష్టించినట్టే.