'రూలర్‌' భామ అందాల హంగామా!

మరిన్ని వార్తలు

ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేందుకు నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో రెండు స్ట్రెయిట్‌ మూవీస్‌ కాగా, మరో రెండు సినిమాలు డబ్బింగ్‌ మూవీస్‌. బాలయ్య 'రూలర్‌' నుండి ముగ్గురు ముద్దుగుమ్మలు భూమిక, వేదిక, సోనాల్‌ చౌహాన్‌ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతుండగా, తేజు 'ప్రతిరోజూ పండగే' సినిమా నుండి రాశీఖన్నా 'ఏంజెల్ ఆర్నా' అంటే మామూలు అమ్మాయి అనుకుంటున్నారా? అని హెచ్చరిస్తోంది. ఇక డబ్బింగ్‌ చిత్రాలుగా వస్తోన్న కార్తి 'దొంగ' ద్వారా జ్యోతిక, నిఖిలా విమల్‌ తమ సత్తా చూపాలనుకుంటున్నారు.

 

హిందీ నుండి వస్తున్న అతిధి సల్మాన్‌ ఖాన్‌ 'దబాంగ్‌ 3'తో హల్‌చల్‌ చేయనున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందరు భామలున్నా, గ్లామర్‌లో ఆ భామదే టాప్‌ హ్యాండ్‌ అనిపిస్తోంది. ఎవరా భామ అనుకుంటున్నారా.? ఇంకెవరు సోనాల్‌ చౌహాన్‌. ఈ పాప ఆల్రెడీ బాలయ్యతో రెండు సినిమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ కొట్టేసింది. ఆ రెండు సినిమాల్లోనూ అందాల ఆరబోతలో పాప టాప్‌ లేపేసింది. ఇక తాజా సినిమాలోనూ బికినీలతో కుర్రోళ్ల మతులు పోగొట్టేసింది.

 

సినిమా వచ్చేలోపే ప్రమోషన్స్‌లోనూ గ్లామర్‌తో పిచ్చెక్కించేస్తోంది. మైక్రో నిక్కర్స్‌, అల్ట్రా మోడ్రన్‌ డ్రస్సులు ధరించి బాలీవుడ్‌ భామల్నే తల దన్నేలా అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తోందీ అమ్మడు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే ముద్దుగుమ్మలందరిలోనూ సోనాల్‌ చౌహాన్‌ గ్లామరే టాప్‌ లెవల్‌ అని చెప్పక తప్పదు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS