మహేష్‌బాబు - మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ మొదలై తొమ్మిది నెలలు గడుస్తున్నా... ఇప్పటి వరకూ టైటిలేంటో చెప్పలేదు, ఒక్క లుక్కూ చూపించలేదు. అదిగో - ఇదిగో అంటున్నారు తప్ప... చేసిందేం లేదు. అయితే ఈ సినిమాపై ఇప్పుడ మరో రూమర్ బయల్దేరింది. ఈ సినిమా అవుట్ పుట్‌పై మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని, కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారని, ఆ హడావుడిలోనే టైటిల్‌పైనా, ఫస్ట్ లుక్‌పైనా దృష్టి పెట్టే టైమ్ లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్, మేలలో రావాల్సిన సినిమా జూన్‌కి వాయిదా పడడానికి కారణం అదే అంటున్నారంతా. అయితే.. వీటిపై చిత్రబృందం స్పందించింది. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని, షూటింగ్ అంతా షెడ్యూల్ ప్రకారమే సజావుగా సాగుతోందని, మురుగదాస్ స్క్రిప్టు ప్రకారం నడుచుకొనే దర్శకుడని, రీషూట్లకు తావే లేదని క్లారిటీ ఇచ్చింది. మరి సినిమా ఇంత ఆలస్యం అవ్వడానికి కారణమేంటో..??