'సాక్ష్యం' మినీ 'బాహుబలి' అవుతుందా?

By iQlikMovies - July 24, 2018 - 11:07 AM IST

మరిన్ని వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'సాక్ష్యం'. ఈ సినిమాని మినీ బాహుబలిగా అభివర్ణించాడు హీరో బెల్లంకొండ. ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డారట. 'బాహుబలి' వెండితెర విజువల్‌ అద్భుతం. ఆ సినిమాని మించిన సినిమా మరోటి లేదు విజువల్‌గా అనే రికార్డు లిఖించేసింది. 

అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న బెల్లంకొండ 'సాక్ష్యం' సినిమా హీరో చెప్పినట్లుగా మినీ బాహుబలి అవుతుందా? అంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఈ సినిమాలోనూ చాలా కష్టపడ్డారట. స్టార్‌డమ్‌తో సంబంధం లేకున్నా, బడ్జెట్‌ పరంగా బెల్లంకొండ సినిమాలు ఎక్కడా రాజీ పడవు. హీరోయిన్‌ దగ్గర్నుంచీ నిర్మాణ విలువల పరంగా ఏ విషయంలోనూ రిచ్‌నెస్‌కి తక్కువ కావు. అది అందరికీ తెలిసిందే. అయితే బాహుబలితో కంపేర్‌ చేయడం ఎంతవరకూ సబబు అంటే , ఆ సినిమాపై యూనిట్‌కున్న నమ్మకం అలాంటిది. అయితే వారి నమ్మకం అవునా? కాదా? అనేది ప్రేక్షకులు డిసైడ్‌ చేయాల్సి ఉంది. 

ఈ సినిమాలో బెల్లంకొండ సరసన హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మరీ అంచనాలు అనలేం కానీ, ఓ మోస్తరు అంచనాలున్నాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడ్డ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS