'బాహుబలి' తెచ్చి పెట్టిన విజయంతో ప్రబాస్‌కి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ వచ్చిన స్టార్‌డమ్ కూడా అలా ఇలా కాదు. యూనివర్సల్ స్టార్ ఇప్పుడు ప్రబాస్. దాంతో ప్రబాస్ 'బాహుబలి' తర్వాత చేయబోతున్న సినిమా అయిన 'సాహో'పై అంచనాలు భారీ ఎత్తున నెలకొన్నాయి. ఇదంతా 'బాహుబలి' పుణ్యమే. 'బాహుబలి ది కంక్లూజన్' విడుదలతోపాటే, 'సాహో' టీజర్‌ని కూడా విడుదల చేశారు. 'ఇట్స్ షో టైమ్' అని ప్రభాస్ ఆ టీజర్‌లో చెప్పి, సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచేశాడు. సుజీత్ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు. నిన్న మొన్నటి దాకా బాలీవుడ్ భామలు కరీనా, కత్రినా, దీపికా ఇలా ఒక్కరేమిటి చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ ఫైనల్ కాలేదు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ 'సాహో'లో విలన్‌గా నటించనున్నాడని టాక్ ఇప్పుడు కొత్తగా వినవస్తోంది. హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు కొత్తగా తెర పైకి వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని 50 నుంచి 60 కోట్లలో తెరకెక్కిద్దామనుకున్నా, మారిన ప్రబాస్ మార్కెట్ లెక్కల నేపథ్యంలో సినిమాని ఇంకా రిచ్‌గా తెరకెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. యూనివర్సల్‌గా ప్రబాస్‌కి ఉన్న మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.