'బాహుబలి'తో ప్రబాస్ యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడాయన నుండి ఏ సినిమా వచ్చిన తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా విడుదలవుతాయి. బాగా వసూలు చేస్తాయి. సో డబ్బింగ్ సినిమానే కదా అని ప్రబాస్‌ని మిగిలిన భాషలు లైట్ తీసుకోవడానికి లేదు. అసలు వివరాల్లోకి వెళితే, ప్రబాస్ తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 15న విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో యాక్షన్ హీరో అజిత్ నటిస్తున్న 'నేర్కొండ పార్వై'ని ఆగష్టు 10న విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ, 'సాహో' రిలీజ్‌తో ఈ చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది. పోస్ట్‌పోన్ చేయడం సబబు కాదని భావించిన అజిత్ అండ్ టీమ్ ఈ సినిమాని అంతకన్నా ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలోనే ఉంది. ఇక నిర్మాణానంతర కార్యక్రమాల్ని వేగవంతం చేసి, వీలైతే జూలైలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అఫ్కోర్స్.. అజిత్ ఫ్యాన్స్‌కిది శుభవార్తే. బాలీవుడ్ సక్సెస్ఫుల్ మూవీ 'పింక్' కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార, అజిత్‌కి జోడీగా నటిస్తోంది. ఏది ఏమైతేనేం, మొత్తానికి ప్రబాస్ సినిమా అంటే, తెలుగు స్టార్లే కాదు, మిగిలిన భాషల్లోనూ స్టార్ హీరోలు తెగ భయపడిపోతున్నారు. బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. 'సాహో' రిలీజ్ టైంకి కాస్త అటూ ఇటూ దగ్గరగా చెప్పుకోదగ్గ బిగ్ సినిమాలేమీ రిలీజ్‌కి లేకుండా జాగ్రత్త పడుతున్నారట. అదీ ప్రెజెంట్ మన డార్లింగ్ మేనియా.