సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం ప్రారంభమైన రోజు నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. జూన్ లో రెండు పైట్స్, పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్ట్ లో జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిల్ రాజు మాట్లాడుతూ.... పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సాయి ధరమ్ తేజ్ కు మా బ్యానర్ కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్ లో వచ్చిన భద్ర, మున్నా, పరుగు, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి చిత్రాలకు పనిచేశాడు. జవాన్ స్టోరీ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. సాయి ధరమ్ తేజ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీ. ఈ చిత్రంతో మా సన్నిహితుడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నాం. సినిమా అనుకున్నట్టుగా చాలా బాగా వచ్చింది అని అన్నారు.
దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. అని అన్నారు.
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ.... జవాన్ ప్రాజెక్ట్ విషయంలో మాకు వెన్నుదన్నుగా ఉన్న సమర్పకుడు దిల్ రాజు గారికి ముందుగా థాంక్స్ చెబుతున్నాను. బివిఎస్ రవి చెప్పిన కథ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కుడుకున్నది. సాయి ధరమ్ బాడీ లాంగ్వేజ్ కి, ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే కాథ కావడంతో... గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. శరవేగంగా షూటింగ్ జరుపుకొని టాకీ పార్ట్ పూర్తి చేశాం.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... నా కేరీర్లో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందించిన దిల్ రాజు గారు జవాన్ ప్రాజెక్ట్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సమర్పణలో కృష్ణ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత కృష్ణ. బివిఎస్ రవి చెప్పిన యూనిక్, ఎంగేజింగ్, ఎంటర్ టైనింగ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. టాకీ పార్ట్ పూర్తయింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అని అన్నారు.